: పటేల్ వర్గ ఎమ్మెల్యేలతో హార్దిక్ రేపు సమావేశం
ఓబీసీ జాబితాలో పటేల్ కులస్థులను చేర్చాలంటూ గుజరాత్ యువనేత హార్దిక్ పటేల్ ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పటేల్ వర్గానికి చెందిన 35 మంది ఎమ్మెల్యేలతో రేపు సమావేశం ఏర్పాటు చేయనున్నారు. పటేల్ కులస్థులను ఓబీసీ జాబితాలో చేర్చాలన్న దానిపై ఎమ్మెల్యేల సలహాలు, సూచనలు, వారి నిర్ణయాలను అడిగి తెలుసుకునేందుకు ఆయన ఈ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం అమలులో ఉన్న రిజర్వేషన్ల వ్యవస్థకు వ్యతిరేకంగా హార్దిక్ పటేల్ గుజరాత్ లో ఇటీవల చేపట్టిన ఆందోళనల్లో ఉద్రిక్తతలు చెలరేగి, పటేల్ వర్గీయులు 10 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.