: క్రీడా అవార్డుల ఎంపికపై పంకజ్ అద్వానీ అసంతృప్తి


కేంద్ర క్రీడా శాఖ అవార్డుల ఎంపికపై స్నూకర్ ప్లేయర్ పంకజ్ అద్వానీ తొలిసారి తన అసంతృప్తి వ్యక్తం చేశాడు. అవార్డుల ఎంపిక పారదర్శకంగా జరగటం లేదని, ఎంపిక కమిటీ పారదర్శకంగా వ్యవహరించడం లేదని విమర్శ ఎక్కుపెట్టాడు. కేంద్ర క్రీడా శాఖ అవార్డుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన మార్గదర్శకాల్లో స్పష్టత లేమే దానికి కారణమని అభిప్రాయపడ్డాడు. దానికి ఉదాహరణకు ఇటీవల టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు ఖేల్ రత్న ప్రకటించడాన్ని ప్రస్తావించాడు. ఎంపిక కమిటీ ఏర్పాటు చేసిన పాయింట్ల ఆధారంగా పారాలంపియన్ గిరీష్... సానియా కంటే ఎంతోె ముందు ఉన్నాడని పేర్కొన్నాడు. అయితే పాయింట్ల వ్యవస్థ సరిగా లేకపోవడమే ఇందుకు కారణంగా చెప్పుకొచ్చాడు. అయితే తాను మాట్లాడి ఒకరోజు గడవకముందే వెంటనే పంకజ్ ట్విట్టర్ లో వివరణ ఇచ్చాడు. అంతర్జాతీయ టెన్నిస్ లో సానియా ఆటతీరును తక్కువ చేయలేమని, ఆమె ఖేల్ రత్నకు అర్హురాలేనని చెప్పాడు. అయితే తన విమర్శ కేవలం కేంద్ర క్రీడాశాఖ, అవార్డుల ఎంపిక కమిటీ పారదర్శకతపైనే అని పంకజ్ వివరించాడు. ఇదే సమయంలో మహిళా స్నూకర్ క్రీడాకారిణి విద్యా పిళ్లై ఉదంతాన్ని ఉదహరిస్తూ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో మెడల్స్, ట్రోఫీలు గెలుచుకున్న ఆమెను ఇప్పటివరకు అర్జున అవార్డుకు కూడా ఎంపిక చేయకపోవడం పట్ల పంకజ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News