: హీరో కంపెనీకి 7.5 లక్షల సైకిళ్ల ఆర్డర్


హీరో సైకిళ్ల కంపెనీకి భారీ ఆర్డర్ వచ్చింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 7.5 లక్షల సైకిళ్లకు ఆర్డర్ చేసింది. వెస్ట్ బెంగాల్ లోని 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఆర్డర్ చేసింది. కాగా, ప్రభుత్వాల నుంచి ఓ సైకిల్ తయారీ సంస్థ ఇంత పెద్ద ఆర్డర్ అందుకోవడం ఇదే తొలిసారని హీరో సైకిల్ యజమాని పంకజ్ ముంజాల్ తెలిపారు. చిన్న, పెద్ద అమ్మకందారులను కలుపుకుని ఈ ఆర్డర్ ను పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. ఎస్సీ, ఎస్టీ డెవలప్ మెంట్ అండ్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ ఆర్డర్ చేసింది.

  • Loading...

More Telugu News