: గీతను ఇండియాకు పంపించేది లేదు: తేల్చి చెప్పిన పాక్ కోర్టు
దాదాపు పుష్కర కాలం క్రితం సరిహద్దులు దాటి పాకిస్థాన్ చేరుకుని అక్కడ ఓ స్వచ్ఛంద సంస్థ సంరక్షణలో ఉన్న భారత యువతి గీతను ఇండియాకు పంపించే ప్రసక్తే లేదని పాకిస్థాన్ హైకోర్టు తేల్చి చెప్పింది. ఆ బాలికను ఇండియా పంపాలని, ఆమె తల్లిదండ్రులు ఎవరో తేల్చాలంటే, ఆమె ఇక్కడ ఉంటేనే సులభమవుతుందని చెబుతూ, భారత సంస్థ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు దాన్ని తోసిపుచ్చింది. తల్లిదండ్రులు ఎవరో కచ్ఛితంగా తెలిస్తే తప్ప ఆమెను పంపేది లేదని స్పష్టం చేసింది. కాగా, వివిధ పత్రికలు, చానళ్లలో ఆమె ఫోటోలను చూసిన పలువురు తల్లిదండ్రులు తమ బిడ్డేనంటూ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.