: మా ఓపికను పరీక్షించొద్దు: భారత్ కు పాక్ ప్రధాని హెచ్చరిక
సరిహద్దుల్లో కాల్పుల విషయమై భారత్ పై బురద జల్లేందుకు పాకిస్థాన్ కొత్త ఆట మొదలెట్టింది. ఇరు దేశాల సరిహద్దుల్లో జరుగుతున్న కాల్పులకు భారత్ దే తప్పు అనే తీరులో పాక్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ అన్నట్లు ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది. కాల్పుల అంశంలో పాకిస్థాన్ ఎంతో ఓపికగా వ్యవహరిస్తుండటాన్ని అసమర్థతగా భావించవద్దని షరీఫ్ భారత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమ ఓపికను పరీక్షించొద్దని, తామేమీ చేతగాని వాళ్లం కాదని ఆయన అన్నారు. భారతదేశం ప్రవర్తిస్తున్న తీరు అంతర్జాతీయ శాంతికి భంగం కల్గించేలా ఉందని షరీఫ్ ఆరోపించారు.