: తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఎప్పుడూ అరెస్ట్ కాలేదు: కిషన్ రెడ్డి


వరంగల్ జిల్లాలో కంతనపల్లి నుంచి దేవాదుల వరకు పాదయాత్ర చేస్తున్న తనను పోలీసులు అరెస్టు చేయడంపై బీజేపీ నేత కిషన్ రెడ్డి విభిన్నంగా స్పందించారు. తన అరెస్ట్ వెనుక రాజకీయ కోణం ఉందని కానీ, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఎన్నడూ అరెస్ట్ కాలేదని విమర్శించారు. ఇదే సమయంలో తనపై తీవ్ర ఆరోపణలు చేసిన మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై మాట్లాడుతూ, ఎవరు ఆంధ్రా ఏజెంట్లో ప్రజలే తేలుస్తారని పేర్కొన్నారు. కొత్త ప్రాజెక్టులను ఆహ్వానిస్తామని, కానీ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయ్యేవరకు ఉద్యమిస్తామని కిషన్ చెప్పుకొచ్చారు. పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపడం లేదన్నారు.

  • Loading...

More Telugu News