: మోదీ చేస్తే కరెక్ట్... మేము చేస్తే తప్పా?: హరీష్ రావు


నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నో పథకాల్లో మార్పులు చేశారని టీఎస్ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్లానింగ్ కమిషన్ ను పక్కనబెట్టి నీతి ఆయోగ్ ను తీసుకొచ్చారని... మరింత బెటర్ గా ఉండాలనే కోణంలోనే ఈ మార్పులు చేసి ఉంటారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కూడా మరింత బాగా ఉండాలనే ఆలోచనతోనే ప్రాజెక్టుల డిజైన్లను మార్చాలని నిర్ణయించిందని... మరి దీనిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. మోదీ చేస్తే కరెక్ట్... మేం చేస్తే తప్పా? అని నిలదీశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకే తెలంగాణలో కిషన్ రెడ్డి నడుచుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ, టీడీపీలు మిత్రపక్షాలు కావడమే దీనికి కారణమని చెప్పారు.

  • Loading...

More Telugu News