: ప్రజలిలా ఉంటే ఏం చేస్తున్నారు?...పార్టీ నేతలపై శివసేన అధినేత ఆగ్రహం


తాగు నీటికి ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడడం చూసిన శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో రైతుల సమస్యలు తెలుసుకునేందుకు యాత్ర చేపట్టిన ఆయన, మరఠ్వాడా ప్రాంతంలో గుక్కెడు తాగు నీటికోసం ప్రజలు పడుతున్న ఇక్కట్లు చూసి చలించిపోయారు. దీంతో ప్రజలు ఇక్కట్లు పడుతూ ఉంటే మీరంతా ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. శివ్ జల్ క్రాంతి యోజన పథకాన్ని మరఠ్వాడా ప్రాంతంలో అమలు చేయాలని ఆయన వారికి సూచించారు. ఇదే నెల రెండో వారంలో మరోసారి ఆ ప్రాంతాల్లో పర్యటిస్తానని తెలిపిన ఆయన అప్పటికల్లా సమస్యలు పరిష్కరించాలని వారికి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News