: కిషన్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు


బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ, ఆయన వరంగల్ జిల్లాలోని కంతనపల్లి నుంచి దేవాదుల వరకు పాదయాత్రను చేపట్టారు. ఆయన వెంట భారీ ఎత్తున బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో వారి పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదని చెప్పారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు, కిషన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News