: రాష్ట్రపతి పతకం అందుకోవడానికి వెళ్తుంటే... దోపిడీ చేశారు


ఆమె పేరు సురేఖ సక్సేనా. మధ్యప్రదేశ్ గ్వాలియర్ నగరానికి చెందిన ఆమె ఓ కేంద్రీయ విద్యాలయంలో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు. రాష్ట్రపతి ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డుకు ఆమె ఎంపికయ్యారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా మెడల్ అందుకోవడానికి తన సోదరుడు సురేందర్ తో కలసి ఆమె సమతా ఎక్స్ ప్రెస్ రైల్లో ఢిల్లీ బయల్దేరారు. రైలు మథుర స్టేషన్ లో ఆగగానే, ఓ చాయ్ వాలా వారి వద్దకు వచ్చాడు. వారికి చాయ్ పోస్తున్నట్టు పోస్తూనే, సడన్ గా ఓ స్ప్రే బాటిల్ తీసి వారిపై స్ప్రే చేశాడు. వారు అడ్డుకునే ప్రయత్నం చేసేంతలోపే... చాయ్ వాలా పారిపోయాడు. ఈ ఘటనలో సురేఖ సక్సేనా పర్సు, ఆమె సోదరుడి గోల్డ్ వాచ్ పోయాయి. దీంతో వారు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News