: సల్మాన్ కంటే మాధురినే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుందట!
ఏంటిది, నిజమేనా? అనుకుంటున్నారా, అవునండి, వందశాతం వాస్తవం. ఎప్పుడు, ఎక్కడ, ఎలా అని ఆలోచిస్తున్నారా? సరే, వివరాల్లోకి వెళితే... 1994లో వచ్చిన 'హమ్ ఆప్కే హై కౌన్' లో సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్ జంటగా నటించారు. సూపర్ హిట్ సాధించిన ఈ చిత్రానికి సల్మాన్ కంటే మాధురినే ఎక్కువ పారితోషికం పుచ్చుకుందని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ వెల్లడించారు. బాలీవుడ్ లో ఈమధ్య తరచుగా హీరో హీరోయిన్ ల పారితోషికంపై చర్చ జరుగుతోంది. ఎంత అగ్ర నాయికలైనా హీరోలకంటే తక్కువగానే ఇస్తున్నారు. ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న కంగనా రనౌత్ ఈమధ్య భారీ పారితోషికం పెంచిందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ట్విట్టర్ లో అభిమానులు అనుపమ్ ను ప్రశ్నించారు. ప్రధానంగా స్త్రీ, పురుష సమానత్వం అంశంపై అడిగారు. ఇందుకు ఆయన స్త్రీ, పురుష వివక్ష నిజమేనంటూ ఇంతవరకూ బయటికిరాని సల్మాన్, మాధురిల పారితోషికం రహస్యాన్ని బయటపెట్టారు.