: హ్యార్లీ డేవిడ్ సన్ బైక్ తో ఉడాయించిన వ్యక్తి దొరికాడు


హైదరాబాద్ లోని బంజారాహిల్స్ షోరూమ్ లో రెండు రోజుల కిందట టెస్ట్ డ్రైవ్ అంటూ హ్యార్లీ డేవిడ్ సన్ బైక్ తో ఉడాయించిన వ్యక్తి ఎట్టకేలకు దొరికాడు. అతడిని పోలీసులు ముంబయిలో ప్రధాన రహదారి వద్ద బైక్ పై వెళుతుండగా పట్టుకున్నారని తెలిసింది. ప్రస్తుతం అతడిని హైదరాబాద్ తీసుకొస్తున్నారు. ఆ వ్యక్తి మద్రాస్ ఐఐటీలో చదువు పూర్తి చేసి ఓఎన్ జీసీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతని స్వస్థలం ఏపీలోని భీమవరం అని తెలిసింది. అతడు దొంగిలించిన బైక్ విలువ సుమారు రూ.6 లక్షలకు పైగానే ఉంటుందని షో రూమ్ నిర్వాహకులు తెలిపారు.

  • Loading...

More Telugu News