: మాస్కో ఎయిర్ పోర్టులో భారీ అగ్నిప్రమాదం... విమాన రాకపోకలకు అంతరాయం
రష్యా రాజధాని మాస్కోలోని డొమోదేడోవో అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో ఇవాళ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎయిర్ పోర్టు ప్రాంగణంలోని బ్యాగేజ్ విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అవి చుట్టుపక్కలకు విస్తరించాయని స్థానిక మీడియా తెలిపింది. దాంతో ఎయిర్ పోర్ట్ అంతటా పొగ ఆవరించింది. ప్రమాదం కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని, మూడువేల మందిని అక్కడి నుంచి బయటికి పంపించినట్టు పేర్కొంది. మంటలు పూర్తిగా అదుపులోకి తెచ్చాక ప్రయాణికులను మళ్లీ ఎయిర్ పోర్ట్ లోకి అనుమతిస్తామని అత్యవసర విభాగ అధికారులు ప్రకటించారు. అగ్ని ప్రమాదంతో దాదాపు 60 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయట.