: కోట్లాది మందిని కన్నీరు పెట్టిస్తున్న ఫోటో ఇది!


ఒక చిత్రం వెయ్యి మాటలతో సమానం. ఈ చిత్రం అంతకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ. ఎందుకంటే ఇది కోట్లాది మంది హృదయాలను కదిలించి వేస్తోంది. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరినీ కనీసం ఒక్క కన్నీటి బొట్టయినా రాల్చేట్టు చేస్తోంది. సిరియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు సృష్టిస్తున్న మారణహోమం నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వేల సంఖ్యలో సాధారణ ప్రజలు వలస వెళుతున్న సంగతి తెలిసిందే. ఇలా వలస వచ్చిన వారి కుటుంబాల్లో ఒకరికి చెందిన మూడేళ్ల బాలుడి మృతదేహం టర్కీ బీచ్ లో కనిపించింది. ముక్కు పచ్చలారని ఈ చిన్నారి బాలుడు ఇసుక తిన్నలపై హాయిగా పడుకుని నిద్రిస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ వాస్తవం ఘోరమైనది. గుండెలను పిండేస్తుంది. ఈ బాబు మృతదేహం సముద్రం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. సిరియాలోని కుర్దు వర్గానికి చెందిన ఈ బాబు పేరు అయిలాన్ కుర్ది. గ్రీకు దీవులను చేరాలన్న ప్రయత్నంలో భాగంగా పడవల్లో వస్తూ మునిగిపోయిన వారిలో ఒకరి సంతానం. ఈ చిత్రాన్ని వాషింగ్టన్ పోస్ట్ బీరూట్ బ్యూరో చీఫ్ లిజ్ స్లై తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. చిన్నారికి చెందిన ఇతర చిత్రాలను సిరియా నుంచి సేకరించి వాటినీ పోస్ట్ చేశారు. ఇప్పుడీ చిత్రం, దాని వెనకున్న కథ లక్షలాది షేర్స్ తెచ్చుకుంది. ఎంతో మంది ప్రముఖులు సహా కోట్లాది మంది స్పందించారు.

  • Loading...

More Telugu News