: అగ్రిగోల్డ్ ఆస్తుల్ని అమ్మకానికి పెట్టాలని హైకోర్టు ఆదేశం


అగ్రిగోల్డ్ స్కాంలో మోసపోయిన ఖాతాదారులకు సొమ్ము తిరిగిచ్చేందుకు ఆ సంస్థ ఆస్తుల్ని అమ్మాలని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. ఇందుకోసం అగ్రిగోల్డుకు చెందిన 14 ఆస్తుల్ని అమ్మకానికి పెట్టాలని ఆదేశాలు ఇచ్చింది. వచ్చిన సొమ్మును కోర్టు పర్యవేక్షణలో ఉంచాలని, మిగతా ఆస్తులను ఎవరికీ అమ్మవద్దని స్పష్టం చేసింది. అంతేగాక అగ్రిగోల్డ్ అనుబంధ సంస్థలు, డైరెక్టర్లు, ఆడిటర్లను గుర్తించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో సమగ్ర వివరాలు ఇవ్వాలని కూడా ప్రభుత్వానికి తెలిపింది. తదుపరి విచారణను కోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News