: ఏపీ శాసనసభ నుంచి వైసీపీ ఎమ్మెల్యేల వాకౌట్


ఏపీ శాసనసభ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. చర్చించే వ్యవధి లేకుండా బిల్లులు పెడుతున్నారని, కావాలనే ఇలా చేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. ఎలాంటి చర్చలు జరపకుండా 9 కీలక బిల్లులను ఎలా ఆమోదిస్తారని వైసీపీ అధినేత జగన్ సభలో ప్రశ్నించారు. తమకు అడిగినంత సమయం ఇవ్వడంలేదన్నారు. అధికారపక్షం తమను బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. పొద్దున బిల్లులు పెట్టి అప్పుడే చర్చపెట్టి మాట్లాడమంటే ఎలా సాధ్యమవుతుందని అడిగారు. ఈ సందర్భంగా బిల్లులు వెంట వెంటనే పాస్ చేయడంపై స్పీకర్ తీరుపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా స్పీకర్ స్పందించకపోవడంతో జగన్, పార్టీ సభ్యులు ప్రభుత్వ, స్పీకర్ తీరును నిరసిస్తూ సభ నుంచి బయటికి వెళ్లారు.

  • Loading...

More Telugu News