: యువ సంచలనం నాకేమీ సన్నిహితుడు కాదు: వీహెచ్ పీ చీఫ్ ప్రవీణ్ భాయ్ తొగాడియా
పటేళ్లకు ‘కోటా’ పేరిట మొదలెట్టిన ఉద్యమంతో అతి స్వల్ప కాలంలోనే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన హార్దిక్ పటేల్ చుట్టూ వివాదాలు కమ్ముకుంటున్నాయి. ఈ వివాదాలపై అతడితో పాటు అతడికి సంబంధం లేని వారు కూడా వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితే విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ) చీఫ్ ప్రవీణ్ భాయ్ తొగాడియాకు ఎదురైంది. గుజరాత్ పటేల్ సామాజిక వర్గానికి చెందిన ప్రవీణ్ భాయ్ తొగాడియాకు హార్దిక్ పటేల్ అత్యంత సన్నిహితుడన్న వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న ప్రవీణ్ భాయ్ తొగాడియా మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. ‘‘ప్రతి రోజు నన్ను ఎంతో మంది కలుస్తారు. నాతో ఫొటోలు దిగుతారు. ఆ ఫొటోలకు తప్పుడు అభిప్రాయాలు సృష్టించేలా వాటిని సోషల్ మీడియాలో వాడుకోవడం సరికాదు’’ అని ప్రవీణ్ భాయ్ తొగాడియా వ్యాఖ్యానించారు.