: విడాకులు ఇచ్చే సంప్రదాయంలో మార్పులు చేసే ప్రసక్తే లేదు: యూపీ ముస్లిం పెద్దలు
ముస్లిం సంప్రదాయంలో విడాకులు ఇచ్చే సమయంలో మూడుసార్లు 'తలాఖ్' చెప్పిస్తారు. అలా అనగానే వారికి విడాకులు మంజూరయ్యాయని ప్రకటించేస్తారు. ఇటీవల జరిపిన ఓ సర్వేలో అత్యధిక మంది ముస్లిం మహిళలు ఈ పద్ధతిని వ్యతిరేకించారు. దానిపై ఉత్తరప్రదేశ్ ముస్లిం పెద్దలు స్పందిస్తూ, విడాకులు ఇచ్చే సంప్రదాయంలో మార్పులు చేసే సమస్యే లేదని స్పష్టం చేశారు. దానిపై ఎవరి అభిప్రాయమూ తెలుసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అయితే, ఈ విధానంలో కొంత మార్పు తీసుకురావాలని ఇతర ముస్లిం సంస్థలు భావించాయి. ఇందుకోసం అభిప్రాయ సేకరణ చేసేందుకు మూడు నెలల సమయం ఇవ్వాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్ బీ)ను కోరినట్టు తెలిసింది. కానీ తమకు ముస్లిం సంస్థల నుంచి ఎలాంటి ప్రత్యేక విన్నపం రాలేదని, వచ్చినా అంగీకరించమని ఏఐఎంపీఎల్ బీ అధికారిక ప్రతినిధి మౌలానా అబ్దుల్ రహీం ఖురేష్ తేల్చి చెప్పారు.