: విగ్రహాల నిమజ్జనం ఈ ఏడాది హుస్సేన్ సాగర్ లోనే... హైకోర్టు గ్రీన్ సిగ్నల్
వినాయక చవితి సందర్భంగా గణేశుడి విగ్రహాల నిమజ్జనం విషయంలో సందిగ్ధత తొలగిపోయింది. ఈ ఏడాదికి హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం చేసుకోవచ్చని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విగ్రహాల నిమజ్జనం వల్ల సాగర్ లో కాలుష్యం పెరుగుతోందన్న పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. అయితే, నిమజ్జనం ముగిసిన వెంటనే వ్యర్థ పదార్థాలను తొలగించాలని ఆదేశించింది. బెంగళూరు, పూణె తరహాలో నిమజ్జనాల కోసం మరో లేక్ ఏర్పాటు చేసుకోవడం మంచిదని కోర్టు అభిప్రాయపడింది.