: ఓట్ల కోసమే ఆయన పాదయాత్ర చేస్తున్నారు: ఎంపీ వినోద్


కంతనపల్లి ప్రాజెక్టు పేరిట తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేస్తున్న పాదయాత్రపై టీఆర్ఎస్ ఎంపీ వినోద్ విమర్శలు చేశారు. ఆ పాదయాత్ర కేవలం ఓట్ల కోసమేనని ఆరోపించారు. త్వరలో జరిగే వరంగల్ ఉప ఎన్నికల నేపథ్యంలోనే కాంగ్రెస్, బీజేపీలు తమ ప్రభుత్వంపై ఈ విధమైన ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. మరోవైపు తెలంగాణలో రైతు ఆత్మహత్యలపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినోద్ బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ హయాంలోనే రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. ప్రాణహిత ప్రాజెక్టులో తట్టెడు మట్టి తీయకుండానే వేలకోట్ల రూపాయలు జేబుల్లో వేసుకున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News