: కాశ్మీర్ లో భీకర ఎన్ కౌంటర్... నలుగురు ఉగ్రవాదుల హతం, ఓ సైనికుడు మృతి


జమ్మూ కాశ్మీర్ లో నేటి ఉదయం భీకర ఎన్ కౌంటర్ జరిగింది. దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు యత్నించగా, భారత సైన్యం తిప్పికొట్టింది. రాష్ట్రంలోని హంద్వారాలో చోటుచేసుకున్న ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ జవాను నేలకొరిగాడు. కాల్పుల అనంతరం అక్కడ సోదాలు నిర్వహించిన భారత సైన్యానికి పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి దొరికాయి. పెద్ద సంఖ్యలో ఆయుధాలు లభించిన నేపథ్యంలో మరింత మంది ఉగ్రవాదులు చొచ్చుకొచ్చి ఉంటారన్న అనుమానంతో సైన్యం ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతోంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News