: మరో ట్విస్ట్... మిఖాయిల్ నా కొడుకే కాదు!: ఇంద్రాణి కొత్త స్టోరీ!


సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో అసలు నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా కొత్త కథ వినిపించింది. తన కుమారుడిగా లోకానికి పరిచయమైన మిఖాయిల్, అసలు తన కొడుకే కాదని, అతన్ని దత్తత తీసుకున్నానని వెల్లడించినట్టు వార్తలు వెలువడ్డాయి. తనను కలిసిన న్యాయవాదికి ఇంద్రాణి ఈ విషయాన్ని వెల్లడించినట్టు 'టుడే' న్యూస్ చానల్ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. కాగా, తాను ఇంద్రాణి కుమారుడినని ఇప్పటికే చాలా సందర్భాల్లో మిఖాయిల్ వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇంద్రాణి టీనేజ్ వయసులో ఉండగా సహజీవనం చేసిన సిద్ధార్థ దాస్, షీనా, మిఖాయిల్ లు తనకు, ఇంద్రాణికి పుట్టినట్టు వెల్లడించారు. ఎవరు ఎవరికి పుట్టారన్న విషయాన్ని డీఎన్ఏ రిపోర్టు తేల్చేస్తుందని పోలీసులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News