: మమ్మల్ని సైకోలంటారా? మీరే రౌడీలు... వేలెత్తి చూపితే భయపడతామా?: జగన్ నిప్పులు
వైకాపా పార్టీని సైకో పార్టీగా మార్చుకోవాలని, వారంతా సైకోలని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై జగన్ మండి పడ్డారు. వైకాపాను సైకో పార్టీ అని అనడాన్ని తప్పుబట్టిన ఆయన, తెలుగుదేశం సభ్యులంతా రౌడీలని, వాళ్లది రౌడీ పార్టీ అని అన్నారు. "పెద్ద పెద్ద కళ్లేసుకుని చంద్రబాబు ఇలా చూస్తున్నారు. వేలెత్తి చూపి భయపెట్టాలని అనుకుంటున్నారు. మేం భయపడం" అని అన్నారు. తమపై ఆరోపణలు చేస్తే సహిస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. జగన్ వ్యాఖ్యలపై తెలుగుదేశం మంత్రులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా, వైకాపా సభ్యులు మరోసారి పోడియంలోకి దూసుకెళ్లి నినాదాలు చేయడం మొదలు పెట్టారు.