: అచ్చెన్నాయుడుపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం ఇవ్వాలనుకుంటున్న వైకాపా
ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత, స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన వైకాపా ఎమ్మెల్యేలను ఉద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైకాపా కాదు... సైకో పార్టీ అని పేరు పెట్టుకోవాలని ఆయన మండిపడ్డారు. దీనిపై వైకాపా నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష స్థానంలో ఉన్న పార్టీని సైకో పార్టీగా అభివర్ణించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో, అచ్చెన్నాయుడుపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం ఇవ్వడానికి వైకాపా సిద్ధమైనట్టు సమాచారం.