: రేపు సమయమిస్తానంటే... నేటి ప్రశ్నోత్తరాలకు ఓకే!: స్పీకర్ కు జగన్ వినూత్న ప్రతిపాదన
కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సభలో ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పీకర్ కోడెల శివప్రసాద్ కు ఓ వినూత్న ప్రతిపాదన చేశారు. రాష్ట్రంలో నెలకొన్న కరవు, నిత్యావసరాల ధరలపై రేపటి సమావేశాల్లో చర్చకు సమయమిస్తానంటే నేటి ప్రశ్నోత్తరాలకు అడ్డు తగలబోమని జగన్ పేర్కొన్నారు. నేటి ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే కరవుపై చర్చకు పట్టుపట్టిన విపక్షం నిరసనకు దిగింది. దీంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. అనంతరం తిరిగి సభ ప్రారంభమైన తర్వాత జగన్ మాట్లాడుతూ స్పీకర్ కు ఈ ప్రతిపాదన చేశారు. దీనిపై స్పీకర్ సహా అధికార పక్ష సభ్యులు విస్మయం వ్యక్తం చేశారు.