: తీరు మారని ఏపీ అసెంబ్లీ... ప్రారంభమైన వెంటనే వాయిదా
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా కొద్దిసేపటి క్రితం నాలుగో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులపై చర్చ కోసం ప్రతిపక్ష వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించారు. దీంతో కరవుపై చర్చకు అనుమతించాల్సిందేనని డిమాండ్ చేస్తూ వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో పాటు ప్లకార్డులను ప్రదర్శించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రారంభమైన వెంటనే సభను స్పీకర్ 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.