: పవన్ కల్యాణ్ ప్లెక్సీలు ధ్వంసం, భీమవరంలో ఉద్రిక్తత
తమ అభిమాన హీరో పవన్ కల్యాణ్ పుట్టినరోజు నాడు అభిమానంతో ఏర్పాటు చేసుకున్న ప్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో, ఆయన అభిమానులు కోపంతో ఊగిపోయారు. ఈ ఘటన బుధవారం రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగింది. పవన్ కల్యాణ్ ప్లెక్సీలను ధ్వంసం చేశారని తెలుసుకున్న అభిమానులు ఆందోళనకు దిగారు. తమకు అనుమానమున్న ఇతర హీరోల అభిమానుల ఇళ్లపై రాళ్ల దాడులు చేశారు. దీంతో భీమవరంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.