: ‘నాగార్జున’లో మరో ర్యాగింగ్ ఘటన... పోలీసులకు ఫిర్యాదు చేసిన డిగ్రీ ఫస్టియర్ విద్యార్థిని
సీనియర్ల వేధింపులు తాళలేక బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యతో వార్తా పత్రికల పతాక శీర్షికలకెక్కిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ భూతం మరోమారు పడగ విప్పింది. ఇప్పటికే రిషితేశ్వరి ఘటనతో వర్సిటీలో అటు విద్యార్థులే కాక అధ్యాపకులూ తీవ్ర ఆందోళనలో పడిపోయారు. ఈ నేపథ్యంలో సీనియర్లు తనను ర్యాగింగ్ చేశారని, వేధింపులకు పాల్పడుతున్నారని డిగ్రీ ఫస్టియర్ చదువుతున్న ఓ విద్యార్థిని నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.