: హార్దిక్ పటేల్ రాసలీలలు?... సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో
పటేళ్ల పోరుతో అటు గుజరాత్ కే కాక, ఇటు కేంద్ర ప్రభుత్వానికి కూడా కొరకరాని కొయ్యగా మారిన యువ సంచలనం హార్దిక్ పటేల్ చిక్కుల్లో పడ్డాడు. స్నేహితులతో కలిసి బ్యాంకాక్ వెళ్లిన హార్దిక్ పటేల్ అక్కడ ఓ విదేశీ వనితతో రాసలీలల్లో మునిగిపోయాడంటూ నిన్న ఓ వీడియో సోషల్ మీడియాలోకి వచ్చేసింది. ‘బ్యాంకాక్ లో హార్దిక్ పటేల్ రాసలీలలు’ పేరిట విడుదలైణ ఈ వీడియో రెండు నిమిషాల నిడివితో ఉంది. ఈ వీడియోలో కనిపిస్తున్న నలుగురు యువకుల్లో ఓ వ్యక్తి అచ్చం హార్దిక్ పటేల్ లాగానే ఉన్నాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో వాట్సప్ సహా సోషల్ మీడియా సైట్లలో హల్ చల్ చేస్తోంది. అంతేకాక ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లలో విచ్చలవిడిగా షేర్ అవుతోంది. అయితే తమ ఉద్యమాన్ని నీరుగార్చేందుకే ఇలా కుట్రలు జరుగుతున్నాయని పటేల్ సామాజిక వర్గం ఆరోపిస్తోంది.