: ఢిల్లీ పెద్దలే బొత్స, ధర్మానలను తప్పించారు....లిక్కర్ సిండికేట్ పై పునర్విచారణ: ఏపీ మంత్రి కొల్లు ప్రకటన


ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ నేతల తలకు చుట్టుకున్న లిక్కర్ సిండికేట్ పునర్విచారణకు ఏపీ సర్కారు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఏపీ ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిన్నటి అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో స్పష్టమైన ప్రకటన చేశారు. 2004-14 మధ్య జరిగిన లిక్కర్ సిండికేట్ వ్యవహారం నాడు కలకలం రేపింది. నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్ లో సీనియర్ మంత్రులుగా ఉన్న ప్రస్తుత వైసీపీ నేతలు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణలతో పాటు కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి పేరు కూడా ఈ వ్యవహారంలో ఉంది. వీరి పాత్రకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు కూడా లభ్యమయ్యాయని కొల్లు రవీంద్ర నిన్న అసెంబ్లీలో చెప్పారు. ‘‘మాకున్న సమాచారం ప్రకారం ఏసీబీ దాడుల్లో బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావుల పాత్ర నిర్ధారణ అయ్యింది. కేంద్రంలో ఉన్న ఢిల్లీ పెద్దలు జోక్యం చేసుకుని వారి పాత్రను తప్పించారు. విచారణను తప్పుదోవ పట్టించారు. ఢిల్లీ పెద్దలు పంచాయతీ చేశారు’’ అని మంత్రి చెప్పారు. సభ్యుల కోరిక మేరకు ఈ కేసును పునర్విచారణ చేయిస్తామని కూడా కొల్లు రవీంద్ర ప్రకటించారు.

  • Loading...

More Telugu News