: సన్నీ లియోన్ యాడ్ తో అత్యాచారాలు పెరుగుతాయి: సీపీఐ నేత


బాలీవుడ్ శృంగార సన్నీ లియోన్ నటించిన కండోమ్ యాడ్ కారణంగా అత్యాచారాలు పెరిగే ప్రమాదం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అన్ జాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, సన్నీ లియోన్ నటించిన మ్యాన్ ఫోర్స్ కండోమ్ యాడ్ భావోద్రేకాలు రెచ్చగొట్టేలా ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, శృంగార తార సన్నీ లియోన్ ఈ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు స్పందించలేదు. గతంలో సన్నీ లియోన్ పై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా సన్నీ లియోన్ నటించిన 'మస్తీ జాదా' సినిమాకు సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చింది. సన్నీ గత సినిమాల్లాగే ఇది కూడా అడల్ట్ సినిమా కావడంలో విశేషమేముంది?

  • Loading...

More Telugu News