: 3,900 కోట్లతో 60 వేల డబుల్ బెడ్రూం ఫ్లాట్లు...ఇక మద్యంపై ఈ ఏడాది పాత పద్ధతే!: కేసీఆర్
3,900 కోట్ల రూపాయలతో పేదలకు డబుల్ బెడ్రూం ఫ్లాట్లు నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాదులో కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో డబుల్ బెడ్రూం ఫ్లాట్ల నిర్మాణం చేపడతామని అన్నారు. పట్టణాల్లో ఈ ఇళ్ల నిర్మాణానికి 5.20 లక్షల రూపాయలు విడుదల చేస్తామని ఆయన చెప్పారు. 60 వేల డబుల్ బెడ్రూం ఫ్లాట్లు నిర్మిస్తామని ఆయన వెల్లడించారు. డబుల్ బెడ్రూం ఫ్లాట్ల లబ్ధిదారులను కలెక్టర్లు ఎంపిక చేస్తారని ఆయన వెల్లడించారు. ఇక మద్యంపై ఈ ఏడాది పాత పద్ధతే కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. గుండుంబాపై ఉక్కుపాదం మోపుతామని ఆయన తెలిపారు. దీనిపై ఐజీ స్థాయి అధికారిని నియమిస్తామని ఆయన వెల్లడించారు. గుండుంబా వ్యాపారులపై అవసరమైతే పీడీ యాక్టు మోపుతామని ఆయన చెప్పారు. గుడుంబాను అరికట్టేందుకు చీప్ లిక్కర్ ను తీసుకురావాలని భావించామని, సమాజంలో దీనిపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఈ ఏడాదికి పాత పద్ధతినే అనుసరించాలని నిర్ణయించామని ఆయన చెప్పారు.