: రాజమండ్రిలో ఎన్నారై కిడ్నాప్


రాజమండ్రిలో గుర్తుతెలియని ఎన్నారై కిడ్నాప్ కు గురైన ఘటన చోటుచేసుకుంది. రాజమండ్రిలోని సోమాలమ్మ దేవాలయం వద్దనున్న ఇంటీరియర్ డెకరేషన్స్ షాప్ ఉంది. ఆ షాపుకు నాలుగు రోజులుగా ఓ ఎన్నారై వస్తున్నాడు. అక్కడికి దగ్గర్లోనే తమ గ్రామమని, తనకు విదేశాల్లో మంచి పలుకుబడి ఉందని, ఏదయినా సహాయం కావాలంటే చేస్తానని చెబుతూ వచ్చాడు. రోజూలాగే ఈ రోజు కూడా ఆ వ్యక్తి ఇంటీరియర్ షాప్ దగ్గర ఉండగా, వేగంగా ఓ స్కోడా కారులో వచ్చిన నలుగురు గుర్తు తెలియని దుండగులు ఆ ఎన్నారైని బెదిరించి, కారులో ఎక్కించుకుని పోయారు. క్షణాల్లో జరిగిపోయిన ఈ ఘటనతో అవాక్కైన షాపు యజమాని దగ్గర్లోని ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఎన్నారై ఎవరు? అతనిని ఎవరు కిడ్నాప్ చేశారు? అనే విషయాలను దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News