: కంటోన్మెంటు బోర్డు ఎదుట టీడీపీ ఎంపీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్నా
హైదరాబాదు కంటోన్మెంట్ బోర్డు ప్రధాన కార్యాలయం ఎదుట టీడీపీ ఎంపీ మల్లారెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కనకారెడ్డి ఆందోళనకు దిగారు. బొల్లారంలోని డంపింగ్ యార్డును తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహిస్తున్నారు. గత కొంత కాలంగా బొల్లారంలోని డంపింగ్ యార్డును తొలగించాలని స్థానికులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానికులతో కలిసి ఎంపీ, ఎమ్మెల్యేలు కంటోన్మెంటు బోర్డు ఎదుట ఆందోళన చేపట్టారు.