: ప్రాణం తీసిన సెల్ఫీ పిచ్చి


ఏదయినా ట్రెండ్ నడిస్తే దానిని అనుసరించడానికి యువత వేలం వెర్రిగా పరిగెడుతుంది. సెల్ఫీ మోజు కూడా అలాగే మారింది. సోషల్ మీడియాలో ఎక్కువ మందిని ఆకట్టుకునేందుకు వినూత్నంగా సెల్పీలు అప్ లోడ్ చెయ్యాలనే యువత వ్యామోహం, వారి ప్రాణాలు బలిగొంటోంది. అమెరికాలోని హూస్టన్ నగరంలో డెలియోన్ అలోన్స్ స్మిత్ (19) అనే యువకుడు తుపాకీతో సెల్ఫీకి పోజిచ్చి అది ప్రమాదవశాత్తు పేలడంతో మృత్యువాతపడ్డాడు. డెలియోన్ సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో అతని బంధువు అదే ఇంట్లో పక్కరూంలో ఉన్నాడు. బుల్లెట్ నేరుగా గొంతులో దిగడంతో అతనిని రక్షించే అవకాశం కూడా లేకపోయిందని డెలియోన్ బంధువు వాపోయాడు.

  • Loading...

More Telugu News