: నవ్వేసి తప్పించుకునే అనిల్ కపూర్... ఈసారి సమాధానం చెప్పాడు!
నిన్నిటి తరం బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ ఆరోగ్య రహస్యం విప్పాడు. బాలీవుడ్ సినిమా ఫంక్షన్లలో అనిల్ కపూర్ సందడి చేసిన ప్రతిసారీ యువ నటులు అడిగే ప్రశ్న ఒకటే... సార్ ఈ వయసులో కూడా ఇంత చలాకీగా, ఆనందంగా, వయసు మళ్లకుండా ఎలా ఉంటున్నారు?... దీనికి ఎప్పుడూ నవ్వేసి తప్పించుకునే అనిల్ కపూర్ ఈసారి సమాధానమిచ్చాడు. జీవితం పట్ల ఉన్న ఆశావహదృక్పథమే తనను ఆరోగ్యంగా ఉంచుతోందని అన్నాడు. భ్రమల్లో బతకనని అనిల్ కపూర్ వెల్లడించాడు. వాస్తవంలో ఉంటూ ఆనందంగా, తృప్తిగా ఉంటానని అనిల్ కపూర్ చెప్పాడు. 'వెల్ కం' సినిమాకు సీక్వెల్ గా 'వెల్ కం బ్యాక్' వస్తుందని అనిల్ చెప్పాడు. సినిమా ఏమీ అంతగొప్పగా ఉంటుందని భావించడం లేదని అనిల్ వెల్లడించాడు. సన్నివేశాలు, కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అనిల్ తెలిపాడు. మజ్నూభాయ్ పాత్రలో తాను కనిపిస్తానని, హాస్య రస ప్రధానంగా సినిమా రూపొందిందని అనిల్ కపూర్ చెప్పాడు. కాగా, ఈ సినిమాలో నానా పటేకర్, జాన్ అబ్రహాం, శ్రుతి హాసన్, పరేష్ రావల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.