: టాటాస్కై నుంచి వైఫైతో కూడిన సెట్ టాప్ బాక్స్


దేశంలో ఎక్కడ చూసినా వైఫై సౌకర్యం పెరుగుతోంది. తాజాగా టాటా స్కై సంస్థ కొత్త సెట్ టాప్ బాక్స్ ని విడుదల చేసింది. అందులో వైఫై రూటర్, డిజిటల్ వీడియో రికార్డింగ్ సౌకర్యాలను ఉంచింది. దాని ద్వారా టీవీలో వచ్చే కార్యక్రమాలను రికార్డు చేసుకోవచ్చన్నమాట. ఆ వీడియోల్ని సెట్ టాప్ బాక్స్ ద్వారా వైఫైని తీసుకునే స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లలోకి తీసుకోవచ్చు. ఈ సెట్ టాప్ బాక్సులో 500జీబీ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చని టాటా స్కై చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ తెలిపారు. దాని ధర రూ.9,300 అని చెప్పారు.

  • Loading...

More Telugu News