: ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువు పెంపు
ఆదాయపు పన్ను రిటర్న్స్ ఇంకా దాఖలు చేయని వారికి శుభవార్త. రిటర్న్స్ దాఖలు చేసే గడువు పెంచుతూ ఆదాయపు పన్ను శాఖ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 7వ తేదీ వరకు గడువును పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. తాము తీసుకున్న నిర్ణయంతో, ఏదైనా కారణం వల్ల ఇంకా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయని ఎంతో మందికి మేలు కలుగుతుందని తెలిపింది.