: భారత్ లో ఇంటర్నెట్ వినియోగదారులు 35 కోట్ల మంది


భారత్ లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య ఏటికేడాది గణనీయంగా పెరుగుతోంది. తాజాగా ఇండియాలో ఇంటర్నెట్ వినియోగదారులు 350 మిలియన్ల (35 కోట్లు)కు చేరారు. జూన్ నెలాఖరుకి 52 మిలియన్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు కొత్తగా పెరగడంతో వినియోగదారుల సంఖ్య 350 మిలియన్లు దాటిందని భారత ఇంటర్నెట్ అండ్ మొబైల్ వినియోగదారుల అసోసియేషన్ తెలిపింది. 2014 అక్టోబర్ నుంచి 26 శాతం ఇంటర్నెట్ వినియోగదారులు పెరిగారని ఈ అసోసియేషన్ వెల్లడించింది. మొబైల్ ద్వారా ఇంటర్నెట్ బ్రౌజ్ చేసేవారు పెరుగుతున్నారని, ఇలా 40 శాతం వినియోగదారులు మొబైల్ ద్వారా ఇంటర్నెట్ వినియోగిస్తున్నారని ఈ అసోసియేషన్ తెలిపింది.

  • Loading...

More Telugu News