: పవన్ 44వ పుట్టినరోజుకు 44 అడుగుల భారీ కేక్
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ పుట్టినరోజును ఆయన అభిమానులు భారీ స్థాయిలో జరుపుతున్నారు. నేడు తమ అభిమాన హీరో 44వ పుట్టినరోజు సందర్భంగా 44 అడుగుల పొడవైన కేక్ ను కాకినాడలో అభిమానులు తయారు చేయించారు. 550 కేజీలున్న ఈ కేకుపై పవన్ పేరు, ఆయన జనసేన పార్టీ లోగోను ముద్రించారు. కాకినాడ జేఎన్ టీయూ విద్యార్థులు ప్రత్యేకంగా ఈ కేక్ ను తయారుచేశారు. అంతేగాక ఆ కేక్ ను ప్రజల సందర్శనార్థం ఉంచారు.