: లండన్ ఛారిటీ మ్యాచ్ లో ఆడనున్న ధోనీ, సెహ్వాగ్


ప్రతి ఏటా లండన్ లో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిర్వహించే ఛారిటీ మ్యాచ్ లో ఈ ఏడాది టీమిండియా కెప్టెన్ ధోనీ, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పాల్గొననున్నారు. 'హెల్ప్ ఫర్ హీరోస్' పేరిట ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఛారిటీ మ్యాచ్ నిర్వహిస్తుంది. ఈ మ్యాచ్ లో ప్రపంచ ప్రఖ్యాత ఆటగాళ్లు పాల్గొననున్నారు. ఆ ఆటగాళ్ల జాబితాలో ధోనీ, సెహ్వాగ్, పాక్ ఆటగాడు అఫ్రిదీ కూడా చోటు సంపాదించుకున్నారు. ఈ మ్యాచ్ నిర్వహణ బాధ్యతలను ఈసీబీ డైరెక్టర్ ఆండ్ర్యూ నిర్వహిస్తుండగా, గవాస్కర్ కూడా నిర్వహణలో పాలుపంచుకోనున్నారు. కాగా, అంతర్జాతీయ స్టార్లతో కలిసి మ్యాచ్ ఆడే అవకాశం రావడం సంతోషంగా ఉందని ధోనీ అభిప్రాయపడ్డాడు. ఓ మంచి ఆశయం కోసం జరుగుతున్న మ్యాచ్ లో భాగం కావడం గర్వకారణమని ధోనీ తెలిపాడు. ఈ మ్యాచ్ కు అందరూ మద్దతివ్వాలని కోరాడు.

  • Loading...

More Telugu News