: 2010 కామన్ వెల్త్ గేమ్స్ స్కాంలో ఐదుగురికి జైలు శిక్ష


కామన్ వెల్త్ క్రీడల కుంభకోణంలోని ఓ కేసులో ఐదుగురికి ఢిల్లీ కోర్టు ఈరోజు జైలు శిక్ష విధించింది. ఈ స్కాంలో వీధి లైట్ల ఏర్పాట్లలో జరిగిన అవినీతికి సంబంధించిన కేసులో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)కి చెందిన నలుగురు ఉన్నతోద్యోగులకు నాలుగేళ్ల జైలు శిక్ష, ఆ వీధి లైట్లు సరఫరా చేసి ఈ కేసులో నిందితుడిగా ఉన్న సంస్థ ఎండీ శ్వేక పవర్ టెక్ ఇంజినీర్స్ మేనేజింగ్ డైరెక్టర్ కు ఆరు సంవత్సరాల శిక్ష అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ స్కాంలో శిక్షలు ఖరారు కావడం ఇదే తొలిసారి. అయితే ఈ కుంభకోణంలో అసలు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి సురేశ్ కల్మాడీ నిందితుడిగా ఉన్న కేసులు ఇంకా విచారణలో ఉన్నాయి. 2010లో కామన్ వెల్త్ క్రీడల కోసం ఢిల్లీలో అప్పటికే ఉన్న వీధి లైట్లను తొలగించి వాటి స్థానంలో అధునాతన లైట్లను ఏర్పాటు చేయాలని క్రీడల కమిటీ నిర్ణయించింది. ఈ పనిని ఓ ప్రైవేట్ కంపెనీకి అప్పగించారు. ఆ కంపెనీ, మున్సిపల్ అధికారులు కుమ్మక్కై స్కాంకు పాల్పడ్డారు. దాంతో ప్రభుత్వానికి రూ.1.42 కోట్ల నష్టం వచ్చిందని 2011లో సీబీఐ దాఖలు చేసిన చార్జ్ షీటులో తెలిపారు.

  • Loading...

More Telugu News