: 46 కోట్ల ఏళ్లనాటి జంతు శిలాజాన్ని గుర్తించి శాస్త్రవేత్తలు
ఇంచుమించు 46 కోట్ల ఏళ్ల కిందట సముద్రంలో జీవించిన వింత తేలు శిలాజాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికాలోని ఆయోవా ప్రాంతంలో యేల్ యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన పరిశోధనల్లో అత్యంత పురాతనమైన ఈ తేలు శిలాజాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. జలచరాల్లో దీనిని అత్యంత పురాతనమైనదిగా భావిస్తున్నామని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనిని 'పెంటెకో పెట్రస్' గా వ్యవహరిస్తున్నారు. ఈ శిలాజం 1. 5 మీటర్ల పొడవున వికృతాకారంలో ఉందని, దీని శరీరం అమరిక చిత్రంగా ఉందని, నీటిలో సులువుగా ఈదడానికి అనువుగా రెండు వైపులా తెడ్డు వంటి కాళ్లు ఉన్నాయని వారు వెల్లడించారు.