: మాతృభాష ద్వారానే ఆంగ్లంలో రాణింపు: సీఎం
చిన్ననాటి నుంచి మాతృభాషను పరిపూర్ణంగా నేర్చుకుంటే అది ఆంగ్ల భాషలో రాణించడానికి ఉపయోగ పడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ అన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ ముందుగా తెలుగు బాషను చక్కగా నేర్చుకోవాలని సూచించారు. హైదరాబాద్ లోని జూబ్లిహాల్లో జరిగిన 'తెలుగులో న్యాయపాలన' సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు.
న్యాయస్థానాలలో తెలుగు అమలు చేయడానికి, న్యాయం ప్రజలకు చేరువకావడానికి ప్రభుత్వం తరఫున అన్నివిధాల సహకారం అందిస్తామని చెప్పారు. ఈ సదస్సులో తీసుకునే అన్ని నిర్ణయాలను అమలు చేస్తామన్నారు. తెలుగు వికాసానికి మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రఘోష్ మాట్లాడుతూ.. మాతృ భాషలోనే భావ వ్యక్తీకరణ ఉన్నతంగా ఉంటుందని చెప్పారు. ఇందుకు ఆయన విశ్వకవి రబీంద్రనాద్ ఠాగూర్ మాటలను ఉదహరించారు. తీర్పులు స్థానిక భాషల్లోనే ఉంటే పారదర్సకత పెరుగుతుందని చెప్పారు
ఇక ప్రజలకు న్యాయస్థానాలు దగ్గర కావాలంటే తీర్పులు, సాక్ష్యాల నమోదు తెలుగులోనే వుండాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. ప్రాంతీయ భాషల్లోనే న్యాయపాలన జరిగితే ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.
న్యాయపాలన తెలుగులో జరిగితే ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. ప్రజలకు అర్ధమయ్యే భాషల్లోనే న్యాయ పాలన ఉండాలని రాజ్యాంగం సూచిస్తోందని చెప్పారు. తెలుగు అమలుకు హైకోర్టు ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేసారు.