: ప్రచారం పిచ్చికి ఈ ఘటన ఓ ఉదాహరణ...ఇది కూడా వ్యాపార సూత్రమే!


వ్యాపారం వృద్ధి చెందాలంటే ప్రచారం కావాలి...ఆస్ట్రేలియాలోని ములులూబా బీచ్ లో 'సన్నీ కోస్ట్ సోషల్ మీడియా' యజమాని ఆండీ సెల్లార్ సోషల్ మీడియాలో చిత్రమైన వీడియో ప్రకటనతో అద్భుతమైన ప్రచారం సొంతం చేసుకున్నాడు. ఈ ప్రచారానికి అందమైన యువతిని ఎంచుకున్నాడు. ఆమెతో ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ వీడియోలో ఏముందంటే...ఓ అందమైన యువతి తన పేరు నటాలీ అమ్యోత్ అని, తన వయసు 26 ఏళ్లు అని, ప్యారిస్ నుంచి వచ్చిన అనాథనని పరిచయం చేసుకుంటుంది. ఆరు వారాల క్రిందట ఆస్ట్రేలియాలో ములులూబా బీచ్ కు వెళ్లానని చెప్పిన ఆ యువతి...అక్కడ అందమైన సాయంత్రాన్ని చూశానంది. "విశాలమైన సముద్రం, వెండి వెన్నెల, నిండు చంద్రుడు, మత్తెక్కించే చల్లగాలి... ఇంతలో ఓ సోగ్గాడు పరిచయమయ్యాడు. అంతే, ఆ రాత్రి అందమైన అనుభవం సొంతమైంది. ఆరు వారాలు గడిచాక అర్థమైంది. అతని కారణంగా తల్లిని కాబోతున్నానని, అయితే ఆస్ట్రేలియా నుంచి పారిస్ కు వస్తుండగా ఫోన్ పోయింది. దీంతో అతనితో కాంటాక్ట్ మిస్ అయ్యింది. ఇప్పుడు నా బిడ్డకు తండ్రి ఎవరో చెప్పండి...దయచేసి ఈ వీడియోను షేర్ చేస్తే అతను చూసే అవకాశం ఉంది"... అంటూ ఓ వీడియోను పోస్టు చేసింది. అయితే ఆమె మాటలు విన్న కొంత మంది ముక్కు మొహం తెలియని వాడితో అనుభవం ఏంటి, పైత్యం కాకపోతే? అంటూ బుగ్గలు నొక్కుకున్నారు. కొంత మంది 'వావ్... అద్భుతమైన అనుభవం' అంటూ అభినందించారు. ఏదైతేనేం, అది కొద్ది సేపట్లోనే సోషల్ మీడియా అద్భుతమైన ప్రచారం సొంతం చేసుకుంది. కొన్ని లక్షల మంది ఈ వీడియోను చూసి షేర్ చేసుకున్నారు. మరుసటి రోజు ఆమె 'ఐ ఫౌండ్ హిమ్' అంటూ మరో వీడియో పోస్టు చేసింది. ఈ వీడియోలో నటాలియాగా పేర్కొన్న యువతి తాను వెతుకుతున్న యువకుడు దొరికాడని చెప్పి పక్కకు తప్పుకోగానే ఆండీ సెల్లార్ వచ్చి ఆ వీడియో గుట్టు విప్పాడు. అది ములులూబా బీచ్ ప్రచారం కోసం తానెన్నుకున్న మార్గమని, ఇలాంటి ప్రచారం వ్యాపార సూత్రమని, ఇలాంటి వీడియోలు మరిన్ని పోస్టు చేస్తానని స్పష్టం చేశాడు. దీంతో సోషల్ మీడియా వినియోగాదారులు అవాక్కయ్యారు!

  • Loading...

More Telugu News