: పీటర్ ముఖర్జియా ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు
కన్న కూతురు షీనా బోరాను హత్య చేసిన కేసులో ఇంద్రాణి ముఖర్జియా పోలీసుల కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఆమె ప్రస్తుత భర్త, స్టార్ ఇండియా మాజీ ఛైర్మన్ పీటర్ ముఖర్జియా నేడు వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఈ తరుణంలో ముంబై పోలీసులు ఈ రోజు పీటర్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. షీనా బోరా కేసుకు సంబంధించి ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమోనని పోలీసులు ఈ సోదాలు జరిపారు. ప్రస్తుతం ఈ సోదాలు హాట్ టాపిక్ గా మారాయి.