: హత్యా రాజకీయాలు చేస్తున్నామని రోజా నిరూపించగలరా?: మంత్రి సునీత


హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ తనపై ఎమ్మెల్యే రోజా చేసిన ఆరోపణలను మంత్రి పరిటాల సునీత ఖండించారు. తన భర్త పరిటాల రవిని చంపింది వైఎస్సే అని చెబుతూ ఒకప్పుడు ఎమ్మెల్యే రోజా ఊరూరు తిరిగారని సునీత అన్నారు. రవి ఫోటోలకు గ్రామగ్రామాన ఆమె దండలు కూడా వేశారని చెప్పారు. ఇప్పుడు తాను హత్యా రాజకీయాలు చేస్తున్నానని రోజా ఆరోపిస్తున్నారని సునీత తెలిపారు. అయితే తాను, తన కుమారుడు హత్యా రాజకీయాలు చేస్తున్నామని రోజా నిరూపించగలరా? అని సునీత మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు. ధరలు తగ్గే వరకూ రూ.20కే ఉల్లిని అందిస్తామని, ఇప్పటివరకు 10,600 మెట్రిక్ టన్నుల ఉల్లిని సరఫరా చేశామని వివరించారు. కర్నూలు ఉల్లిని కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News