: సుందర్ పిచయ్ తో భేటీ కానున్న మోదీ... శంతను నారాయణ్, సంజయ్ మల్హోత్రాలతో కూడా!


భారత ప్రధాని నరేంద్ర మోదీ తన అమెరికా పర్యటనలో భాగంగా అక్కడ సత్తా చాటుతున్న భారత సంతతి కార్యశూరులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకు అమెరికా వెళుతున్న నరేంద్ర మోదీ, ఆ దేశ నగరం శాన్ జోష్ లో ప్రవాస భారతీయులు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న సమావేశంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఇప్పటికే అక్కడి ప్రవాస భారతీయులు ఆసక్తి కనబరుస్తున్నారు. శాన్ జోష్ లోని శాప్ సెంటర్ లో ఏర్పాటు కానున్న ఈ సమావేశంలో మోదీ ప్రసంగాన్ని వినేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే దాదాపుగా టికెట్లన్నీ బుక్ అయ్యాయి. ఈ సమావేశం కోసం శాన్ జోష్ వెళ్లనున్న మోదీ, గూగుల్ సీఈఓ సుందర్ పిచయ్ తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇంకా అబోడ్ సిస్టమ్స్ సీఈఓ శంతను నారాయణ్, శాన్ డిస్క్ సీఈఓ సంజయ్ మల్హోత్రాలతోనూ భేటీ కానున్నారు. వీరితో పాటు అక్కడి కంపెనీల్లో సత్తా చాటుతున్న ఇతర భారత సంతతి వ్యక్తులతో భేటీ అయ్యేందుకు ప్రధాని ఆసక్తి కనబరుస్తున్నారు.

  • Loading...

More Telugu News