: ఏపీని వైయస్ భ్రష్టు పట్టించారు... జనాలు కూడా ఆరేళ్లకే ఆయనను మరచిపోయారు: అచ్చెన్నాయుడు
అసెంబ్లీ లాంజ్ లో మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఫొటోను తొలగించడంపై వైకాపా సభ్యులు శాసనసభలో నిరసన వ్యక్తం చేశారు. దీనిపట్ల మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు. వైయస్ చనిపోయిన ఆరేళ్లకే ఆయనను జనాలంతా మరచిపోయారని... కానీ, ఎన్టీఆర్ ను మాత్రం 20 ఏళ్లు గడచిపోయినా ఇంకా గుర్తుంచుకున్నారని అన్నారు. ఎన్టీఆర్ ఫొటోనే అసెంబ్లీలో లేనప్పుడు, వైయస్ ఫొటో అవసరం ఏముందని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి అని విమర్శించారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరును తొలగించి, తెలుగువారి ఆత్మ క్షోభకు వైయస్ కారకుడయ్యారని మండిపడ్డారు. ఒకవేళ, ఫొటో పెట్టాల్సి వస్తే మాజీ ముఖ్యమంత్రుల ఫొటోలన్నీ పెట్టాలని సూచించారు.