: సభను కించపరిచేలా కేవీపీ నాకు లేఖ రాశారు: స్పీకర్ కోడెల
కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు శాసనసభను కించపరిచేలా తనకు లేఖ రాశారని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. అసెంబ్లీ లాంజ్ లో కేవలం సభాపతుల ఫొటోలు మాత్రమే ఉంటాయని... ఇతరుల ఫొటోలు ఉండవని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రుల ఫొటోలు కమిటీ హాల్ లో మాత్రమే ఉంటాయని తెలిపారు. రాష్ట్ర విభజనలో భాగంగా కమిటీ హాలు తెలంగాణకు వెళ్లిందని చెప్పారు. అసెంబ్లీ, జనరల్ పర్పస్ కమిటీ అనుమతులు లేకుండా ఎవరి ఫొటోను పెట్టలేమని అన్నారు. గతంలో వైయస్ ఫొటో పెట్టినప్పుడు ఆ నిబంధనను పాటించలేదని తెలిపారు. ఈ విషయాలన్నింటినీ పట్టించుకోకుండా కేవీపీ తనకు లేఖ రాసి, సభను కించపరిచారని కోడెల వ్యాఖ్యానించారు. కేవీపీ రాసిన లేఖను మీరు సమర్థిస్తారా? అంటూ వైకాపా సభ్యులను స్పీకర్ ప్రశ్నించారు.